సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా, కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "రైటర్ పద్మభూషణ్". లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ సంయుక్త బ్యానర్ లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు.
వచ్చే నెల మూడవతేదీన థియేటర్లకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం మేకర్స్ ముమ్మర ప్రచార కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను విడుదల చేసేందుకు ఈ రోజే ముహూర్తం ఖరారు చేసారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి హైదరాబాద్లోని AMB సినిమాస్ స్క్రీన్ 1 లో రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. సూపర్ 'హిట్' హీరో అడివిశేష్ చేతులమీదుగా ట్రైలర్ విడుదల కాబోతుండడం విశేషం.