నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త సినిమా "వీరసింహారెడ్డి". ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన వీరసింహారెడ్డి ప్రేక్షకాభిమానులను విశేషంగా అలరిస్తుంది. పండక్కి విడుదలైన ఈ సినిమా పంచభక్ష్య భోజనం వంటి కమ్మని ఫీలింగ్ ను చూసే ప్రేక్షకులకు కలిగించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వీరసింహారెడ్డి కలెక్షన్ల ప్రభంజనం ఒక రేంజులో సాగుతుంది.
ఈ నేపథ్యంలో 'వీరసింహుని విజయోత్సవం' పేరిట VRS సక్సెస్ సెలెబ్రేషన్స్ ను జరిపేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్లోని JRC కన్వెన్షన్స్ లో వీరసింహుని విజయోత్సవం జరగబోతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.