ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా శుక్రవారం నాడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని రష్మీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బరువెక్కిన గుండెతో తమ కుటుంబం ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికామని రష్మీ తెలిపింది. ప్రమీలా మిశ్రా స్ట్రాంగ్ ఉమెన్ అని, తమపై ఆమె ప్రభావం ఎంతో ఉంటుందని, ఆమె జ్ఞాపకాలు తమతో ఎప్పుడూ ఉంటాయని రష్మీ పోస్ట్ చేసింది.