తెనాలికి చెందిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల వరుస సినిమాలతో క్రేజ్ దక్కించుకుంటోంది. ఇప్పుడు హిందీలో కూడా మెరుస్తున్న ఈ భామ అందాలు ఆరబోసేందుకు కూడా సిద్ధం అంటోంది.తెలుగమ్మాయి అయినా శోభిత ధూళిపాళ్ల ఎక్కువగా హిందీలో క్రేజ్ తెచ్చుకుంటోంది. గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది.
బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. తాజాగా శోభిత తన అందంతో మరోసారి అభిమానులని మంత్రముగ్దుల్ని చేసింది. ట్రెండీగా ఉన్న డ్రెస్ లో స్కిన్ షో చేస్తూ రెచ్చిపోయింది. బ్రాని తలపించేలా ఉన్న బ్లూ టాప్, లెహంగాలో లో కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. ఆమె ధరించిన టాప్ సన్నటి దారాలతో ఉంది. ఆ దారాలు తెగితే అంతే పరిస్థితి అంటూ నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ పెడుతున్నారు. అంత రిస్క్ అవసరమా అంటూ కొంటె కామెంట్స్ చేస్తున్నారు.