రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ గారు, చలపతి రావు గారు ..ఇలా గతేడాది దిగ్గజ నటులు టాలీవుడ్ కి దూరమైన విషయం తెలిసిందే.
లేటెస్ట్ గా టాలీవుడ్ లో మరొక విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచే కి పితృవియోగం కలిగింది. ఈ నెల 17న తన తండ్రి పొద్దున్నే లేచి, స్నానము చేసి, ఆపై పూజ, బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి, తనకిష్టమైన మడతకుర్చీలో వెనక్కి వాలి ప్రాణానికి ప్రాణమైన భగవద్గీతను చదువుతూనే శాశ్వత నిద్రలోకి జారుకున్నారని, ఏ రోజు ఎవరినీ ఇబ్బంది పెట్టని తన తండ్రి ఆఖరి క్షణాల్లో కూడా అలానే వెళ్లిపోయారని పేర్కొంటూ రఘు కుంచె సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసారు. ఈ సందర్బంగా తన తండ్రిని చాలా మిస్సవుతున్నానని ఆయన పేర్కొన్నారు.