రంజిత్ జెయకోడి దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మాకర్స్ 'మైఖేల్' అనే టైటిల్ ని లాక్ చేసారు. మైఖేల్ మూవీ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా అన్ని సౌత్ ఇండియన్ భాషలు మరియు హిందీలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 23న నటసింహం నందమూరి బాలకృష్ణ లాంచ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.
ఈ పాన్-ఇండియన్ చిత్రం 'మైఖేల్'లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అండ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa