పాప్ ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ ఓ సంచలనం. అయితే మైఖేల్ వ్యక్తిగత జీవితంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఇటు స్టార్ డమ్, అటు కాంట్రవర్సీస్ వీటన్నిటినీ ఇప్పుడు తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హాలీవుడ్‌కు చెందిన లయన్స్ గేట్ ఎంటర్ టైన్ మెంట్ కార్పోరేషన్ ఇప్పుడు మైఖెల్ జాక్సన్ జీవితంపై బయోపిక్ తెరకెక్కించబోతోంది. మైఖెల్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని అమెరికన్ ఫిల్మ్ మేకర్ ఆంటోనీ తెరకెక్కించనున్నాడు.