తెలుగులో అత్యద్భుతమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌస్ లలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. తాజాగా ఇప్పుడు ఇతర భాషా చిత్రాలను కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మించడం ప్రారంభించింది. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌తో 'నడికర్ తిలగం' అనే టైటిల్ తో ఒక చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు స్టార్ హీరో పుట్టినరోజును పురస్కరించుకుని మూవీ టీమ్ ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. టోవినో థామస్ లుక్ జీసస్ క్రైస్ట్‌ను పోలి ఉంటుంది.
డ్రైవింగ్ లైసెన్స్ ఫేమ్ లాల్ జీన్ పాల్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. సౌభిన్ షాహిర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పుష్ప మేకర్స్‌తో కలిసి అల్లన్ ఆంటోని మరియు అనూప్ వేణుగోపాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. యక్జాన్ గారి పెరీరా మరియు నేహా ఎస్ నాయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa