మోస్ట్ ప్రెస్టీజియస్ మరియు మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా డిసెంబర్ 16న 160 భాషల్లో ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ముందుకొచ్చిన అద్భుతమైన విజువల్ వండర్ "అవతార్ 2" గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ నంబర్లను నమోదు చేస్తుంది. ఇప్పటివరకు అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1.91బిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో కూడా అవతార్ 2 కలెక్షన్ల జోరు రోజు రోజుకూ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. పోతే, ఇండియాలో ఒక్కో వారంలో అవతార్ 2 కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం..!!
ఫస్ట్ వీక్ : 182. 90 కోట్లు
సెకండ్ వీక్ : 98.49 కోట్లు
థర్డ్ వీక్ : 54. 53 కోట్లు
ఫోర్త్ వీక్ : 21.53 కోట్లు
ఫిఫ్త్ వీక్ : 9. 45 కోట్లు
సిక్స్త్ వీక్ (శుక్రవారం) : 1. 30 కోట్లు
మొత్తంగా ఇండియాలో 368. 20 కోట్ల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను రాబట్టి, ఎవెంజర్స్ :ఎండ్ గేమ్ (367 కోట్లు) లైఫ్ టైం కలెక్షన్లను దాటేసింది. దీంతో అవతార్ 2 తాజాగా ఇండియాలో హైయెస్ట్ హాలీవుడ్ గ్రాసర్ గా నిలిచి, సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa