కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ కుమార్ నటించిన సరికొత్త చిత్రం "తునివు". హెచ్ వినోద్ డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా పొంగల్ కానుకగా ఈనెల 11వ తేదీన విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుంది.
తునివు తదుపరి విఘ్నేష్ శివన్ తో అజిత్ ఒక సినిమాను చేసేందుకు కమిటైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది.
తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో కీలకమైన ఉపాధ్యాయురాలి పాత్రలో ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి నటించబోతుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రాబోతుందంట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa