ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని 25వ సినిమా ద‌ర్శ‌కుడిగా ఇంద్ర‌గంటి

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 19, 2019, 04:23 AM

నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో జర్సీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి నుండి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపద్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు నాని. గతంలో నాని, ఇంద్రగంటి చేసిన అస్టాచెమ్మ, జెంటిల్మెన్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అదే తరహాలో ఈ సినిమా ఉంటుందేమో చూడాలి.దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమా నాని కెరీర్ లో 25వ సినిమా అవ్వడం విశేషం. నాని మొదటి సినిమా అస్టా చెమ్మ సినిమాకు దర్శకత్వం వహించిన ఇంద్రగంటి 25వ సినిమాను డైరెక్ట్ చెయ్యడం విశేషం. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa