సినిమా జయాపజయాలతో సంభంధం లేకుండా మూవీస్ చేస్తున్నాడు హీరో కల్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ హీరో గుహన్ దర్శకత్వంలో 118 అనే సినిమాలో నరిస్తున్నాడు. థ్రిల్లర్ నేపద్యంలో వస్తోన్న ఈ సినిమాలో శాలినీ పాండే, నివేద థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత సితార ఎంటెర్తైంమెంట్స్ బ్యానర్ లో మజ్ను సినిమా దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు ఈ హీరో. పల్లెటూరు నేపద్యంలో జరిగే ఒక ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. ఫ్యామీలీ ఎంటెర్టైనర్ గా ఈ సినిమాను ఉండనుందని సమాచారం. ఈ సినిమాతో పాటు మైత్రి మూవీస్ బ్యానర్ లో కల్యాణ్ రామ్ ఒక సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది త్వరలో క్లారిటీ రానుంది. ఇటీవల ఎన్‌టిఆర్ బయోపిక్ సినిమాలో కల్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa