లండన్ బాబులు, పలాస 1978 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో రక్షిత్ అట్లూరి లేటెస్ట్ గా తన నెక్స్ట్ మూవీ ఎనౌన్స్మెంట్ చేసారు. 'మీ ఆలోచనలే మీ శత్రువులు' థీమ్ తో "ఆపరేషన్ రావణ్" టైటిల్ తో విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రిగ్యుయింగ్ గా ఉంది. పలాస 1978 నిర్మించిన సుధాస్ మీడియా సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 2 గా ఈ సినిమా తెరకెక్కబోతుంది.
వెంకట సత్య దర్శకత్వంలో రోడ్ ట్రిప్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. శరవణ వాసుదేవన్ సంగీతం అందిస్తున్నారు. పోతే, తెలుగుతో పాటుగా ఈ సినిమా తమిళం, కన్నడ, మలయాళ భాషలలో కూడా విడుదల కాబోతుంది.