ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రంతో గతేడాది ప్రేక్షకులను పలకరించి, అలరించిన హీరో అల్లరి నరేష్ ఈఏడాది "ఉగ్రం" తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. నరేష్ - విజయ్ కలయికలో వచ్చిన "నాంది" సూపర్ హిట్ గా నిలవడంతో ఈకాంబో పై ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మిర్నా హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, ఉగ్రం మూవీ ప్రస్తుతం డబ్బింగ్ ఫార్మాలిటీస్ జరుపుకుంటుందని తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ నుండి అఫీషియల్ అప్డేట్ వచ్చింది.
పోతే,ఉగ్రం సినిమా ఏప్రిల్ 14వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.