ఆండ్రియా గాయనిగా, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. అన్ని భాషల్లో అభిమానులకు దగ్గర అవుతుంది. అప్పట్లో కార్తి హీరోగా వచ్చిన 'యుగానికి ఒక్కడు' సినిమాతో ఇక్కడ పలకరించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు వేసింది. ఆ తర్వాత సునీల్, నాగ చైతన్య హీరోలుగా వచ్చిన 'తడాఖా'లో కూడా మెరిసింది. అయితే తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. తమిళంలోనే ఎక్కువగా చేసింది. తెలుగు సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఇక్కడ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అదిరిపోయే హాట్ షోతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది.