పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాపై సినిమా ప్రకటిస్తూ, ప్రేక్షకాభిమానుల్లో ఎక్జయిటింగ్ లెవెల్స్ ని పెంచేస్తున్నారు. అలానే కన్ఫ్యూషన్ కూడా పెంచేస్తున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం పవన్ చేతిలో మూడు అధికారిక ప్రాజెక్టులు, ఒక ప్రచారంలో ఉన్న ప్రాజెక్ట్ ఉన్నాయి. కానీ సెట్స్ పైకి వెళ్ళింది మాత్రం ఒకే ప్రాజెక్ట్ ..అదికూడా ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటుంది. అదీగాక వచ్చే ఏడాది ఏపీ ఎలక్షన్స్లో పవన్ పోటీ చెయ్యబోతున్నారు. అందుకు ప్రచారం చెయ్యాలి.. ఇందుకోసం పవన్ చాలా సమయం కేటాయించాలి.
ఈ విషయం పక్కన పెడితే, తాజాగా పవన్ రీసెంట్గా ఎనౌన్స్ చేసిన డైరెక్టర్ సుజిత్ ప్రాజెక్ట్ కు ఈ నెల 30వ తేదీన పూజా కార్యక్రమం జరిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ ల 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా పూజా కార్యక్రమం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే.