సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్' సినిమా హిందీ, తెలుగు మరియు తమిళంలో విడుదలైయింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇండియాలో విడుదలైన తొలిరోజే 54 కోట్లు రాబట్టి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన రోజునే 'పఠాన్' 100 కోట్లు వసూలు చేసింది.
తాజా అప్డేట్ ప్రకారం, పఠాన్ మొదటి రోజు న్యూజిలాండ్ బాక్స్ఆఫీస్ వద్ద NZ$110,000 వసూలు చేసింది. ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా తన ట్విటర్‌లో పఠాన్ కలెక్షన్స్ ని షేర్ చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది.