నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న చిత్రం "అమిగోస్". అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
కాసేపటి క్రితమే ఈ సినిమా నుండి రొమాంటిక్ 'ఎన్నో రాత్రులొస్తాయి' సాంగ్ ప్రోమో విడుదలైంది. పూర్తి పాట జనవరి 29 సాయంత్రం 05:09నిమిషాలకు విడుదల కాబోతుంది. పోతే, ఈ పాట ఇళయరాజా స్వరపరిచిన, నటసింహం బాలకృష్ణ నటించిన "ధర్మక్షేత్రం" సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి ఐకానిక్ సాంగ్ రీమిక్స్ వెర్షన్. ఓల్డ్ వెర్షన్ ను స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడగా, న్యూ వెర్షన్ ను SPB చరణ్, సమీరా భరద్వాజ్ పాడారు. వేటూరి సుందరరామమూర్తి గారు సాహిత్యం అందించారు.