టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ "మైఖేల్" చిత్రంతో పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్గా నటిస్తుంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నారు.
వచ్చే నెల మూడవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న మైఖేల్ మూవీకి సంబంధించి ప్రస్తుతం మేకర్స్ ముమ్మర ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు నుండే మైఖేల్ ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమైనట్టుగా మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa