శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని "దసరా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమా టీజర్ ఈరోజు వివిధ భాషల్లో గ్రాండ్ లాంచ్‌కు సిద్ధమైంది. భారతీయ సినిమాకే గర్వకారణం మరియు మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్ఎస్ రాజమౌళి దసరా యొక్క తెలుగు టీజర్‌ను మరికొన్ని నిమిషాల్లో డిజిటల్‌గా ఆవిష్కరించబోతున్నట్లు తాజా సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ ప్రొఫైల్స్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
యాక్షన్ డ్రామాగా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా 30 మార్చి 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.