సమంతా, దేవ్ మోహన్ జంటగా నటించిన 'శాకుంతలం' సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది. తొలుత ఈ సినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేయాలని భావించారు. అయితే విడుదల వాయిదా వేస్తున్నామని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాను కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలము' నాటకం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa