ప్రస్తుతం మహేశ్ బాబు 'మహర్షి' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు .. సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. దాంతో కథా నేపథ్యం ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది.
ఈ సినిమా అడవి నేపథ్యంలో కొనసాగుతుందనేది తాజా సమాచారం. 'రంగస్థలం' కథ గోదావరి నేపథ్యంలో ఎలా సాగుతుందో, ఈ కథ అలా అడవి నేపథ్యంలో నడుస్తుందని అంటున్నారు. కథ మహేశ్ బాబుకి బాగా నచ్చేసిందట. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఆయన కూడా ఆసక్తిని చూపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మే నెలలో గానీ .. జూన్ లో గాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావొచ్చని అంటున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa