హెచ్ వినోద్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'తునివు' సినిమా జనవరి 11, 2023న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ హీస్ట్ డ్రామా ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అద్భుతమైన రికార్డ్‌ను క్రియేట్ చేసింది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం, గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ సినిమాల లిస్ట్ లో (ఫిబ్రవరి 6-12) మొదటి 5 స్థానాల్లో రెండు స్థానాలను పొందిన ఏకైక భారతీయ చిత్రంగా 'తునివ' నిలిచింది. గత వారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా యొక్క తమిళ వెర్షన్‌ను 4.05 మిలియన్ గంటలు మరియు హిందీ వెర్షన్‌ను 3.73 మిలియన్ గంటలు ప్రసారం చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో భారతీయ చలనచిత్రం సృష్టించిన అరుదైన OTT ఫీట్ ఇది. మరోవైపు, భారతదేశంలో తునివు యొక్క హిందీ, తమిళం మరియు తెలుగు వెర్షన్లు వరుసగా 1వ, 2వ మరియు 4వ స్థానాల్లో స్థిరపడ్డాయి.
ఈ బ్యాంక్ హీస్ట్ థ్రిల్లర్ సినిమాలో అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది. సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.