ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిస్కో రాజా లో ముసలివాడిగా రవితేజ

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 27, 2019, 03:47 PM

ఇతర భాషా చిత్రాలను ప్రేరణగా తీసుకొని సినిమాల తెరకెక్కించడం టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉంది.  మన సినిమాలలో చాలావాటి మూలాలు హాలీవుడ్ సినిమాలే కాకుండా కొరియన్ సినిమాల్లో కూడా ఉంటాయాని ప్రూఫులు కూడా చూపిస్తుంటారు కొందరు నెటిజనులు. అ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుందా అన్నట్టుగా ప్రస్తుతం తెలుగు లో రెండు సినిమాలు ఒక కొరియన్ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. 

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంతా 'బేబీ' అని అనే సినిమాలో నటిస్తోంది.  ఈ సినిమా 'మిస్ గ్రానీ' అనే కొరియన్ సినిమాకు రీమేక్ అని కొందరు అంటున్నారు. అఫీషియల్ రీమేకా లేదా  జస్ట్ ఇన్స్పిరేషనా అనే విషయంపై క్లారిటీ లేదు గానీ 'మిస్ గ్రానీ' లో లాగే ఈ సినిమాలో కూడా ఒక ముదుసలి మహిళ అందమైన యువతి శరీరంలో ఉండడం అనేది కాన్సెప్ట్. ఇదిలా ఉంటే రవితేజ-వీఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కనున 'డిస్కోరాజా' సినిమాలో రవితేజ ఒక ముసలివాడుగా కన్పిస్తాడట.  ఆ ముసలి వ్యక్తి అదృశ్యమై కుర్రవాడిగా తిరిగొచ్చి శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ సినిమా కాన్సెప్ట్ అని సమాచారం.రెండూ సినిమాల్లో కామన్ పాయింట్ 'కుర్ర బాడీలో ముసలి మనిషి ఉండడం'. మిగతా స్టొరీ డ్రైవ్ వేరుగా ఉన్నప్పటికీ ఈ పాయింట్ మాత్రం మిస్ గ్రానీ నుండి తీసుకున్నదేనని అంటున్నారు.  ఒకేసారి రెండు తెలుగు సినిమాలు ఒకే సినిమా ఆధారంగా తీసుకొని తెరకెక్కుతుండడం మాత్రం విశేషమే.  ఈ సినిమాలు రిలీజ్ అయితే గానీ ఒరిజినల్ సినిమాకు ఈ సినిమాలకు ఎలాంటి పోలికలు ఉన్నాయో మనకు తెలిసే అవకాశం లేదు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa