రీ రిలీజ్ ట్రెండ్లో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి ఆల్ టైం బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ లో ఒకటైన "గ్యాంగ్ లీడర్" కూడా చేరబోతోంది. విడుదలై ముప్పై ఏళ్ళు నిండిన సందర్భంగానూ మరియు చిరు యాక్టింగ్ కెరీర్ 45 వసంతాలు జరుపుకుంటున్న నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ మేకర్స్ మరోసారి ఈ సినిమాను థియేటర్లకు తీసుకువస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా రేపు 4కే రీ మాస్టర్డ్ వెర్షన్ లో థియేటర్లలో సందడి చెయ్యడానికి ముస్తాబయింది.
విజయ బాపినీడు డైరెక్షన్లో క్రైమ్ యాక్షన్ ఫిలిం గా రూపొందిన ఈ సినిమా 1991లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇందులో విజయశాంతి హీరోయిన్ గా నటించగా, రావు గోపాలరావు, ఆనంద్ రాజ్, మురళి మోహన్, శరత్ కుమార్ కీరోల్స్ లో నటించారు. బప్పి లహరి సంగీతం అందించారు.