ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేటెస్ట్ హార్రర్ థ్రిల్లర్ బుల్లితెర ఎంట్రీకి డేట్, టైం ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2023, 06:10 PM

గతేడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలలో 'మసూద' ఒకటి. సక్సెస్ఫుల్  థియేట్రికల్ రన్ తో, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా తదుపరి ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చి అక్కడ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది.


ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అయ్యేందుకు సమయం ఆసన్నమైంది. ఈ మేరకు మార్చి 5వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు జెమిని టీవీ లో మసూద వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జరిగింది.



ఈ సినిమాలో హీరోయిన్ సంగీత, తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్, ముఖ్యపాత్రల్లో నటించారు. శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, సత్యం రాజేష్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సాయి కిరణ్ డైరెక్ట్ చేసారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. దిల్ రాజు గారు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com