నాచురల్ స్టార్ నాని నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్నకొద్దీ అభిమానుల్లో ఎక్జయిట్మెంట్ లెవెల్స్ మరింత పెరిగిపోతూ ఉన్నాయి.
తాజాగా ఈ ఎక్జయిట్మెంట్ తో కొంతమంది నాని అభిమానులు వినూత్న పద్దతిలో దసరా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రకృతి సిద్ధమైన రంగులతో నాని ముఖచిత్రాన్ని రూపొందించి, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేసారు. నాచురల్ కలర్స్ తో ఈ అభిమానులు గీసిన నాని రంగోలి ప్రస్తుతం వైరల్ గా మారింది.