కన్నడ సినిమాలలో కొరియోగ్రాఫర్ గా పని చేసి, ఆపై దర్శకుడిగా మారి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న కొరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ A. హర్ష. రీసెంట్గానే 'వేద' రూపంలో బిగ్ కమర్షియల్ హిట్ సాధించిన హర్ష తాజాగా తన నెక్స్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ హీరోతో చెయ్యబోతున్నారు. ఆయనెవరో కాదు మ్యాచో స్టార్ గోపీచంద్.
గోపీచంద్ 31వ సినిమాగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ లో ప్రొడక్షన్ నెం 14 గా రూపొందుతున్న సినిమాకు హర్ష దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు ఈ రోజు ఉదయం ఈ సినిమా యొక్క అధికారిక పూజా కార్యక్రమం జరిగింది. మరి, ఈ నెల్లోనే ఒక మంచి రోజున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.