హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రగా నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. కాగా ఈ చిత్రం నుండి ‘పాప నీకేదంటే ఇష్టం’ అనే పాట విడుదల అయింది చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.
ఇక ‘ఖైదీ నెం 150’ మరియు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాల్లోని ప్రత్యేక పాటల్లో నటించి మెప్పించిన రాయ్ లక్ష్మి, మళ్లీ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ చిత్రంతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుండగా.. రంగస్థలం ఫేమ్ పూజిత పొన్నాడ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తుంది. ఈ చిత్రాన్ని ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో నవీన్ నేని, మహాత్ మరియు పంకజ్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని హాస్యం ప్రేక్షకులను బాగా అలరిస్తోందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది.
Meet #PapaAtthiliPapa
Here's the full lyrical video of a dance number from @iamlakshmirai's #WhereIsTheVenkatalakshmihttps://t.co/KUiiT2IyLI
Music by @GowrahariK @Kishorekumartfi @Madhunandanacto #Praveen @MangoMusicLabel
— Vamsi Kaka (@vamsikaka) January 29, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa