బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రి ఈమధ్య కెరీర్ లో కాస్త స్లో అయింది. దానికి కారణం తన పర్సనల్ లైఫ్ అని.. అమెరికన్ ఫిలిం ఎడిటర్ డైరెక్టర్ అయిన మాట్ అలోంజో తో ప్రేమాయణమే అని బాలీవుడ్ లో రూమర్లు ఉన్నాయి. ఈ రూమర్లు అంతటితో ఆగలేదు.. నర్గిస్ ప్రెగ్నెంట్ అయిందని కూడా వార్తలు వచ్చాయి. అంతేనా బాలీవుడ్ నటుడు ఉదయ్‌చోప్రాతో కూడా ఆమె ఎఫైర్ నడిపిందనే రూమర్స్ ఉన్నాయి. లేటెస్ట్‌గా అమావాస్ చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. అయితే ‘అమావాస్’ నిర్మాతలు నర్గిస్‌ను ఇండియాకు రప్పించి ప్రమోషన్స్ పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు గానీ ఆమె మాత్రం స్పందించడం లేదట. ప్రతి ఇంటర్వ్యూలో తన పర్సనల్‌లైఫ్‌కు సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నారని భయపడుతుందట. భూషణ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సచిన్ జోషి హీరో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa