టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని దర్శకుడు విజయ్ కనకమేడలతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'ఉగ్రం' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకొని CBFC నుండి U/A సర్టిఫికేట్ ని పొందినట్లు సమచారం.
ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా జోడిగా నటిస్తుంది. ఈ సినిమా మే 5, 2023న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.