ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అర్జున్ రెడ్డి' కోసం వెయిట్ చేస్తున్న 'దొరసాని'

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 03:00 PM

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ఈ సినిమాలో కథానాయిక. ఆనంద్ దేవరకొండ .. శివాత్మిక ఈ సినిమాతోనే పరిచయం కానున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే కథ కావడంతో, వరంగల్ .. సిద్ధిపేటలలో ఎక్కువభాగం చిత్రీకరణ జరిపారు. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం చిత్రీకరణను జరుపుకుంది.

ఫస్టులుక్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టడానికి ఈ సినిమా టీమ్ సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ .. రాజశేఖర్ల చేతులమీదుగా ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలనుకుంటున్నారట. ఒక వైపున విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' షూటింగుతోను .. మరో వైపున 'కల్కి' సినిమా షూటింగుతో రాజశేఖర్ బిజీగా వున్నారు. ఈ ఇద్దరికీ సమయం దొరగ్గానే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తారట. మధుర శ్రీధర్ .. యష్ రంగినేని నిర్మిస్తోన్న ఈ సినిమాకి, మహేంద్ర దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa