ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫొట స్టోరీ : మాళవిక శర్మ హాట్ ఫోటో షూట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 24, 2019, 04:47 PM

 కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తొలి సినిమాతోనే కొంద‌రు ముద్దుగుమ్మ‌లు అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు అలాగే గుర్తుంది మాళవిక శర్మ. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం త‌క్కువే. కానీ ఒక్క‌సారి ర‌వితేజ న‌టించిన నేలటిక్కెట్టు సినిమా గుర్తు చేస్తే మాత్రం ఆమె కూడా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో అంత‌గా అందాలు ఆర‌బోసింది ఈ బ్యూటీ. ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు ఈ భామ‌కు ఆఫ‌ర్లు రావ‌డం లేదు. దాంతో అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుంది.


తాజాగా విడుద‌లైన ఓ ఫోటోషూట్ చూసి అభిమానులు సైతం ఫిదా అయిపోతున్నారు. గూగుల్ త‌ల్లి సైతం వేడెక్కిపోతుంది ఈ ముద్దుగుమ్మ తాకిడికి. థ‌ర్మామీట‌ర్లు పేల్చే అందాల‌తో దున్నేస్తున్నా కూడా భారీ సైజుల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. నేలటిక్కెట్టు సినిమాలో నాజూగ్గా క‌నిపించిన మాళ‌విక‌.. ఇప్పుడు మాత్రం ఊహించ‌ని విధంగా లావు అయిపోయింది.


దాంతో అభిమానులు కూడా ఈ బ్యూటీని చూసి షాక్ అవుతున్నారు. బ్రాండ్స్‌లో దూసుకుపోయిన మాళ‌విక‌.. ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుంది. ఆఫ‌ర్లు రాకపోయినా కూడా అందంగా ముస్తాబవుతూ హాట్ ఫోటోస్‌తో మతులు చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి మ‌రి ఈమె క‌ష్టం ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలిక‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa