అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ చిత్రం 'బాజీరావ్ మస్తానీ' చిత్రంలో ఒక పాటకు రణవీర్ సింగ్ వేసిన డ్యాన్సును మార్ఫింగ్ చేశారు. ఈ పాటలో రణవీర్ తల స్థానంలో ట్రంప్ తలను ఉంచారు. ఈ పాటలో ట్రంప్ అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేలా మార్ఫింగ్ చేయడం నిజంగా అద్భుతంగా ఉంది. ఈ వీడియోకు 'పేష్వా వారియర్ ట్రంప్' అనే పేరు పెట్టారు. ఎంతో ఫన్నీగా అనిపిస్తున్న ఈ వీడియోను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa