‘చెరువు మీద అలిగి….పోయాడట’ అని సామెత తెలుసా? తెలీకపోతే తెలుసుకోండి. పాకిస్తాన్ పరిస్థితి అచ్చం అలాగే ఉంది మరి. భారత వాయుసేన ఈ రోజు పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడాన్ని ఆ దేశ నేతలు జీర్ణించుకోవడం లేదు. ఏదో.. ఎప్పట్లాగే బెదిరిస్తోందిలే, భారత్ చాలా శాంతి దేశం, దాన్ని ఎంత కెలికినా ఏమీ చేయదులే, దానికంత సీన్ లేదు అనుకున్న పాక్.. ఈ రోజు జరిగిన దాడులతో కుదేలవుతోంది.దాడులపై అక్కసుతో తమ దేశంలో బాలీవుడ్ చిత్రాలను నిషేధిస్తున్నా పాక్ సమాచార ప్రసార మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ ప్రకటించారు. ‘ నేటి నుంచి మేం భారత్‌కు చెందిన ప్రతీదాన్నీ బహిష్కరిస్తున్నాం. మా దేశంలో ఏ బాలీవుడ్ సినిమా ఆడదుల.. అంతేకాకుండా భారత కంపెనీల వాణిజ్య ప్రకటనలను కూడా అడ్డుకుంటాం.. ’ అని అన్నారు. పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్ నటీనటులను తీసుకోకూడదని బాలీవుడ్ నిర్ణయించడం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa