బుల్లితెరలో తనదైన కామెడీతో పంచులతో నవ్విస్తూ వస్తున్నాడు 'సుడిగాలి సుధీర్'. జబర్దస్త్ తో ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయ్యాడు. తాను ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చాల సార్లు నిరూపించుకుంటూ మరి కొన్ని షో లతో బిజీగా మారాడు.ఈ నేపథ్యంలోనే త్వరలో ఆయన హీరోగా ఒక సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. బాగా పేరున్న దర్శకుడే సుధీర్ హీరోగా ఈ సినిమా చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు.
గతంలోనే సుడిగాలి సుధీర్ హీరోగా ఒక చిన్న సినిమా నిర్మితమైందిగానీ, కొన్ని కారణాల వలన అది విడుదల కాలేదు. అప్పటి నుంచి హీరో వేషాలపై పెద్దగా ఆసక్తి చూపకుండా .. కమెడియన్ గానే చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సారి ఓ పేరున్న దర్శకుడే తనని సంప్రదించడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. చూడాలి .. సుడిగాలి సుధీర్ హీరోగా కూడా రాణిస్తాడేమో.