బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తొలి తమిళ చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. ఉయర్నత మణిదాన్ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమిళ్‌వాణన్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అమితాబ్ ఈ చిత్రంలో తన లుక్ ని ఇటీవల విడుదల చేశారు. తమిళనాడు స్టైల్ లో అడ్డా బొట్టు, పంచె కట్టు లుక్ లో అమితాబ్ కనిపిస్తున్నారు. ఇక ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ తో కలసి ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ తన కల నెరవేరిందని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి అమితాబ్ బచ్చన్ తో నటించాలని అనుకుంటున్నా. ఇన్నాళ్లకు న కోరిక నెరవేరింది. ఈ సంధర్భంగా ఇద్దరికి నేను కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నా. ఈ చిత్రాన్ని నాకు దక్కేలా చేసిన మురుగదాస్ కు, ఈ చిత్రాన్ని ప్రకటించిన రజని సర్ కు కృతజ్ఞతలు అంటూ సూర్య కామెంట్ చేశాడు.
తాజాగా మరో ఆసక్తికర విషయం ఈ చిత్రం గురించి వినిపిస్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ కు జోడిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోందట. తమిళ, హిందీ రెండు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. సైనా నరసింహా రెడ్డి, బ్రహ్మాస్త్ర లాంటి చిత్రాల్లో అమితాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa