హనుమాన్ దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సూపర్ హీరో మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా మరో అరుదైన ఫీట్‌ను అందుకుంది హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈమూవీ తాజాగా 250 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. గణతంత్ర దినోత్సవం కావడంతో జనవరి 26 హనుమాన్ వసూళ్లు మరింత పెరిగాయి. అందుకే కేవలం 15 రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లు దాటేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా 250 కోట్ల పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇప్పట్లో రవితేజ ఈగల్ తప్ప మరే పెద్ద లు రిలీజ్ కావడం లేదు. సో.. రాబోయే రోజుల్లో హనుమాన్ రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ లో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో మెరిసింది. వినయ్ రాయ్ స్టైలిష్ విలన్ గా మెరిశాడు. సముద్ర ఖని, జబర్దస్త్ శీను తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక హనుమాన్ కు అమ్ముడైన ప్రతి టికెట్‌పై 5 రామ మందిరానికి విరాళంగా అందుతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఇటీవల 2.66 కోట్ల రూపాయాలను రామ మందిర నిర్మాణానికి విరాళంగా అందజేసింది. అలాగే తమ కు నార్త్‌లోనూ ఊహించని స్పందన వస్తోంది.