యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానరుపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం మజిలీ. ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించి సెన్సిబుల్ సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఆడియెన్స్ కి థాంక్స్ తెలపడానికి థాంక్స్ మీట్ ఏర్పాటు చేసారు. హీరో నాగచైతన్య, హీరోయిన్స్ సమంత, దివ్యాంశ, దర్శకుడు శివ నిర్వాణ, నటులు రావు రమేష్, పోసాని కృష్ణమురళి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa