కొంత కాలంగా గోపీచంద్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన అనుకున్న సమయానికి 'ఆక్సిజన్' రిలీజ్ కాకపోవడం 'గౌతమ్ నంద' పరాజయం నిరాశకు గురిచేశాయి. దాంతో ఈ సారి కథ విషయంలో ఆయన మరింత శ్రద్ధ పెట్టాడు. ఈ నేపథ్యంలో నూతన దర్శకుడు చక్రి .. ఆయనకి ఒక కథ వినిపించాడు. ఆ కథ బాగా నచ్చేయడంతో గోపీచంద్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రాధా మోహన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక గోపీచంద్ .. కృష్ణవంశీ దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. గతంలో ఈ కాంబినేషన్లో 'మొగుడు' సినిమా వచ్చింది. మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ కానుందనే విషయంలో వాస్తవమెంతన్నది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa