ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉన్నది ఒకటే జిందగీ మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 27, 2017, 01:08 PM

టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు సంపాదించుకొన్న రామ్ పోతినేని నటించిన చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. నేను శైలజ, హైపర్ చిత్రాల తర్వాత వస్తున్న చిత్రమిది. మరో హిట్‌ను కెరీర్‌లో జమ చేసుకొనేందుకు రామ్ మళ్లీ నైను శైలజ దర్శకుడు కిషోర్ తిరుమలతో జతకట్టాడు. ఫ్రెండ్స్ షిప్ అంశాన్ని ప్రధానంగా చేసుకొని రూపొందించిన ప్రేమ కథా చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠితోపాటు యువ హీరో శ్రీ విష్ణు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


కథ : అభిరామ్ (రామ్) చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తల్లి లేదనే బాధతో అనుక్షణం బాధపడుతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో అభిరామ్‌కు స్కూల్ మేట్ వాసు (శ్రీవిష్ణు) అండగా నిలుస్తాడు. అమ్మలేని బాధను మరిపిస్తాడు వాసు. అలా వారి విడదీయలేని స్నేహం ఏర్పడుతుంది. కాలేజీ‌ లైఫ్‌లో అభిరామ్ ర్యాక్ బ్యాండ్ ఏర్పాటు చేసుకొని, వాసు ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు.


జీవితంలో ఎదురైన సమస్యలకు: ఇలా ప్రాణస్నేహితుల జీవితాల్లోకి మహా (అనుపమ పరమేశ్వరన్) ఓ డాక్టర్ ప్రవేశిస్తుంది. మహా కారణంగా అభిరామ్, వాసు విడిపోవాల్సి వస్తుంది. ఒకరికి మరొకరు అంటే ప్రాణం అనుకొనే స్నేహితులు మహా కారణంగా విడిపోతారు. వారి మధ్య విభేదాలకు మహా ఎలా కారణమైంది. మహా క్యారెక్టర్ ఏమైపోయింది. విడిపోయిన తర్వాత మళ్లీ అభిరామ్, వాసు కలుసుకొన్నారా? ఈ కథలో లావణ్య త్రిపాఠి పాత్ర ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే ఉన్నది ఒకటే జిందగీ.


ఉన్నది ఒకటే జిందగీలో మూడు రకాల జీవిత ప్రయాణం కనిపిస్తుంది. బాల్యం, కాలేజీ లైఫ్, కాలేజ్ లైఫ్ తర్వాత అనే అంశాలపై కథ కొనసాగుతుంది. చిత్ర ఆరంభంలో అభిరామ్, వాసు మధ్య స్నేహం ఎలా ఏర్పడింది. వారు ప్రాణ స్నేహితులుగా ఎలా మారారు. తొలిభాగంలో మహాపై అభిరామ్, వాసుకు ఏర్పడిన ప్రేమ అనేవి కీలక అంశాలు. ఇంటర్వెల్‌కు ముందు ఊహించని ట్విస్ట్‌తో కథను మరో మలుపు తిరగడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.


రెండో భాగంలో ఇలా.. ఇక రెండో భాగంలో తన స్నేహితుడి వివాహం కోసం ఊటికి వచ్చిన అభిరామ్, వాసు మధ్య జరిగిన సన్నివేశాలు, పెళ్లిలో కామెడీ అంశాలతో ప్రీ క్లైమాక్స్ వరకు కథను లాక్కొచ్చినట్టు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో లావణ్య పాత్ర చుట్టు తిరిగే పాత్రలు, క్లైమాక్స్‌ చాలా రొటీన్‌గా ముగుస్తుంది. అయితే ఓవరాల్‌గా కథా పరంగా చూస్తే బోలెడు ప్రేమ కథ సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే పాత కథే అయినప్పటికీ ట్రీట్‌మెంట్ పక్కగా ఉండటంతో ఓ ఫీల్ గుడ్ చిత్రమని అనిపిస్తుంది. అయితే చాలా సన్నివేశాలు సహజత్వానికి దూరంగా ఉండటం ఈ చిత్రంలో ఓ ప్రధాన లోపమని చెప్పవచ్చు.


రామ్ మరోసారి ఎనర్జిటిక్‌గా ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో రామ్ మరోసారి ఎనర్జిట్ ఫెర్మార్మెన్స్‌ను అందించాడు. పాటలు, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్‌లో చక్కగా రాణించాడు. గత చిత్రాల కంటే భిన్నంగా కనిపించడమే కాకుండా పరిణితిని కూడా ప్రదర్శించాడు. ఈ సినిమాలో రెండు రకాల గెటప్స్‌లో అలరించాడు. కీలక సన్నివేశాల్లో రామ్ పలికించిన హావభావాలు ఆకట్టుకొంటాయి.


వెడ్డింగ్ ప్లానర్‌గా లావణ్య ఇక రెండో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి కనిపించింది. ఆమె వెడ్డింగ్ ప్లానర్‌ పాత్రను పోషించింది. ఈ చిత్ర కథలో ఆమె పాత్ర సహజంగా అనిపించకపోగా ఏదో అతికించిన విధంగా అనిపిస్తుంది. లావణ్య త్రిపాఠి పాత్రలో ఎలాంటి ఎమోషన్స్‌కు చోటు లేకపోవడం వల్ల పెద్దగా ప్రేక్షకులు గుర్తుంచుకొని అవకాశం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa