యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా అను ఎమ్మాన్యూయల్‌ను తీసుకోనున్నారనే మాటలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం డిజె బ్యూటీ పూజా హెగ్డేను రంగంలోకి దింపనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పూజా.. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa