ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఈ ప్రాజెక్ట్ ఒకటి. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ డ్రాగన్ అనే టైటిల్ ని లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం సెప్టెంబర్ 2024లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ దాదాపు 15 దేశాల్లో జరుగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది.