’మహాభారత కాలాన్ని.. భవిష్యత్తును ముడిపెట్టి ‘కల్కి’ కథ అల్లుకున్నా‘ అని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ’నేను తొలుత ఈ కథను ఒక్క సినిమాగానే తెరకెక్కించాలనుకున్నా. కొన్ని షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయ్యాక ఇంత పెద్ద కథను ఒక్క భాగంలో చెప్పడం అంత తేలిక కాదనిపించింది. అప్పుడే దీన్ని భాగాలుగా చూపించాలనుకున్నా. చాలా మంది ‘ఇది మైథాలజీనా. చరిత్రా?’ అని అడుగుతున్నారు. మేమైతే ఈ కథను చరిత్రగానే చెప్పాం‘ అని అశ్విన్ అన్నారు.