ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా SS రాజమౌళిపై ఒక డాక్యుమెంటరీని ప్రకటించింది. మోడరన్ మాస్టర్స్: SS రాజమౌళి అనే టైటిల్‌తో ఈ డాక్యు-ఫిల్మ్ ని ఆగస్ట్ 2 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది అని ప్రకటించింది. అనుపమ చోప్రా అందించిన ఈ సిరీస్ రాజమౌళి భారతీయ చలనచిత్రాన్ని ఎలా విప్లవాత్మకంగా మార్చాడు మరియు అంతర్జాతీయ సినిమాని ఎలా ప్రభావితం చేసాడు అనే దానిపై ఉంటుందని సమాచారం. 74 నిమిషాల (1 గంట మరియు 14 నిమిషాలు) డాక్యుమెంట్ ఫిల్మ్‌లో చిత్రనిర్మాత యొక్క అసాధారణ ప్రయాణాన్ని హైలైట్ చేసే ఇంటర్వ్యూలు మరియు BTS ఫుటేజీలు ఉంటాయి అని సమాచారం. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఫిల్మ్ కంపానియన్ స్టూడియోలతో కలిసి నెట్‌ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని నిర్మించింది.