రెండేళ్ల విరామం తర్వాత శర్వానంద్ 'మనమే' అనే లైట్ హార్టెడ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించగా, దర్శకుడి కుమారుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో నటించారు. ఈ రొమాంటిక్ కామెడీ స్ట్రీమింగ్ హక్కులను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ చిత్రం ఆగష్టు 16, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రాజ్ కందుకూరి, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, తులసి మరియు సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి మ్యూజిక్అం దించారు.