బిగ్‌బాస్ 8వ సీజన్ మొదలైన కొన్ని రోజులకే రచ్చ మొదలైంది. కనీసం ఒక వారం రోజులు కూడా ముగియకముందే గొడవలు, అలకలు, అరుపులతో హౌజ్ గందగరోళంగా మారింది.ఇప్పటికే టాస్క్‌లు గెలిచిన నిఖిల్, సోనియా.. ఏకాభిప్రాయంతో యష్మిని మూడో చీఫ్‌గా ప్రకటించారు. దీంతో వీరు ముగ్గురు ఎలిమినేషన్ నుంచి సహజంగానే తప్పించుకున్నారు. ఇక హౌజ్‌లో నామినేషన్ ప్రక్రియ మొదలుకాగానే అసలు మ్యాటర్ మొదలైంది.చీఫ్‌లుగా ఎన్నికైన ముగ్గురుకి నామినేషన్ నుంచి బిగ్‌బాస్ మినహాయింపు ఇచ్చాడు. అలాగే హౌస్‌మేట్స్ ఇద్దరిని చొప్పున నామినేట్ చేస్తే అందులో ఒకరి సేవ్ చేస్తూ మరొకిరిని నామినేట్ చేసే అధికారం చీఫ్‌లకు ఉందని పేర్కొన్నాడు. దీంతో సోనియా బేబక్కను నామినేట్ చేసింది. కిచెన్‌లో బాధ్యతారాహిత్యంగా ఉన్నందుకే ఆమెను నామినేట్ చేసినట్లు సోనియా తెలిపింది. బేబక్కను పూర్తిగా మాట్లాడనివ్వు అని చీఫ్‌లు అనగానే.. మీరేమీ జడ్జిలు కాదంటూ వారిపై అరిచేసింది సోనియా.
ఇదిలా ఉంటే.. అనంతరం ప్రేరణను నామినేట్ చేసిన సోనియా కాస్త ఘాటూగానే స్పందించింది. ఇదేం పిక్నిక్ కాదంటూ, ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావేమో.. కానీ, అవతలివారికి కోపం వచ్చినప్పుడు మధ్యలో వచ్చి ఆపే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ క్రమంలో ప్రేరణ.. తనతో పెద్ద గొడవే పెట్టుకుంది. చీఫ్ యష్మి.. వారిద్దరిలో బేబక్క నామినేషన్‌కు పచ్చజెండా ఊపింది. ఇక నబీల్.. నాగమణికంఠను, బేబక్కను నామినేట్ చేశాడు. యష్మి నాగమణికంఠ నామినేషన్‌ను ఫైనలైజ్ చేసింది. అనంతరం శేఖర్ బాషా.. నాగమణికంఠ, బేబక్కల ఫోటోలను బండరాయిపై అతికించాడు. చీఫ్ నైనిక.. వీరిలో నాగమణికంఠను నామినేట్ చేసింది.
ఇక బేబక్క విషయానికొస్తే నబీల్‌ను నామినేట్ చేసింది. అలాగే ప్రృథ్వీని కూడా నామినేట్ చేసింది. అనంతరం నిఖిల్ ప్రృథ్వీ నామినేషన్‌ను ఫైనల్ చేశాడు. ఇదిలా ఉంటే నామినేషన్ పర్వం ఈరోజు కూడా కొనసాగనుంది. హౌజ్ మెంబర్స్ మిగతా వాళ్లను కూడా నామినేట్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే నామినేషన్ జాబితాలో ఉన్న వారి పేర్లు బయటకు వచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ జాబితాలో పృథ్వి, నాగమణికంఠ, శేఖర్ బాషా, విష్ణుప్రియ, సోనియా, బేబక్క ఉన్నట్ సమాచారం. అయితే వీరిలో ఎవరినైనా సేవ్ చేసే అవకాశం ఛీఫ్‌లకు బిగ్‌బాస్ ఇస్తాడా అనేది చూడాల్సి ఉంది. మొత్తం మీద హౌజ్ నుంచి మొదట ఎవరు బయటకు వెళ్తారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.