కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ జంటగా, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో, మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌కలిసి నిర్మిస్తున్న సినిమా.. మన్మథుడు-2. ఇటీవలే పోర్చుగల్‌లో 32 రోజుల భారీ షెడ్యూల్‌జరిగింది. సమంత కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యింది. కోడలు పిల్లతో నాగార్జున కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు మహానటి కీర్తి సురేష్ కూడా మన్మథుడు టీమ్‌తో జాయిన్ అయ్యింది.
కీర్తిది ఈ సినిమాలో క్యామియో రోల్ అని తెలుస్తుంది. నాగ్, కీర్తిల కెమిస్ట్రీ బాగుంది. ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తయిందని, అవుట్ పుట్ పట్ల నాగార్జున హ్యాపీగా ఉన్నాడని మూవీ యూనిట్ తెలిపింది. త్వరలో మన్మథుడు 2 న్యూ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాకి సంగీతం : చైతన్య భరద్వాజ్, నిర్మాతలు : నాగార్జున అక్కినేని, పి.కిరణ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa