మెగాస్టార్ చిరంజీవి 69 సంవత్సరాల వయసులో కూడా హీరోగా సినిమాలలో నటిస్తున్నారు అంత యాక్టివ్గా జీవిస్తున్నారు అంటే ఆయన జీవనశైలి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది .తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవికి ఒక క్రేజ్ ఉంది.మెగాస్టార్ చిరంజీవి 69 సంవత్సరాల వయసులో కూడా యువకుడిలా యాక్టివ్ గా ఉండడం వెనుక ఆయన జీవనశైలి కారణమని చెప్పొచ్చు.మరి చిరంజీవి అంత ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడం వెనుక ఉన్న లైఫ్ స్టైల్ సీక్రెట్స్ ను, ఆయన ఆహారపు అలవాట్లను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చిరంజీవి కఠినమైన దినచర్యను ఫాలో అవుతారు. పనిని ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తారు. ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేస్తారు. కుటుంబం కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తారు. ప్రతిరోజు వ్యాయామం, యోగ తదితర విధానాల ద్వారా శారీరక దృఢత్వానికి చిరంజీవి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆయన ధ్యానంతో పాటుగా మనసుకు ఉల్లాసం కలిగించే అనేక పనులను చేస్తారు. కుటుంబ సభ్యులతోనూ, కుటుంబంలోని పిల్లలతోనూ సరదాగా గడుపుతారు. తనకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయాన్ని కేటాయించి సంతోషంగా ఉంటారు. స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటారు. తనకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ చిరంజీవి తన నిద్రకు విశ్రాంతికి తగిన సమయాన్ని కేటాయిస్తారు.
ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు ఆయన నిద్రపోతారు. చిరంజీవి ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా అనుసరిస్తారు. ఇక చిరంజీవి తన ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుంటారు. సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటారు. పండ్లు, కూరగాయలు తృణధాన్యాలు , లీన్ ప్రోటీన్ లతో ఉన్న ఆహారాలను తీసుకుంటారు. రోజంతా శరీరాన్ని డిహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుకుంటారు. శరీరానికి సరిపడా నీటిని తాగుతారు.
ప్రాసెస్ చేసిన ఆహారాలను, జంక్ ఫుడ్స్ ను తీసుకోరు. వీటి స్థానంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటారు. చిరంజీవి చాలా మితంగా తింటారు. సాంప్రదాయ తెలుగు వంటకాలను ఆస్వాదిస్తారు. ప్రతిరోజు మంచి పోషకాలు ఉన్న అల్పాహారంతో తన రోజును ప్రారంభిస్తారు. లంచ్, డిన్నర్ కోసం పులిహోర, పప్పు, సాంబార్, చేపలు, చికెన్ ఇలా మంచి పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటారు.జంక్ ఫుడ్స్ ను స్నాక్స్ గా తీసుకోరు. ఆ స్థానంలో పండ్లు గింజలు వంటి ఆహారాన్ని తీసుకుంటారు. ప్రతిరోజు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపే తన డిన్నర్ ను పూర్తి చేస్తారు. ఈ జీవనశైలి అలవాట్లే చిరంజీవి ఆరోగ్యంగా ఉండడానికి కారణమని చెబుతారు ఆయనను దగ్గరగా చూసిన సన్నిహితులు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యంగానూ ఉత్సాహంగానూ ఉండాలని భావించే వారు చిరంజీవి లాగా మీ జీవన విధానాన్ని మార్చుకోండి. చిరంజీవులుగా బ్రతికేయండి.