ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం (Tirumala Laddu Controversy) ఫై చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.యావత్ హిందువులు ఎంతో పవిత్రంగా భవించే లడ్డు..గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అపవిత్రమైంది. ఈ తప్పును సరిద్దికోవాలని ..ప్రతి ఒక్కరు కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి కి పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ్ హీరో కార్తీ ..తిరుమల లడ్డు విషయంలో సెటైర్లు వేయడం ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు ఆగ్రహం తెప్పించాయి. తిరుమల లడ్డూ కల్తీ జరగడంతో కలత చెందిన పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్లను శుభ్ర పరిచారు. ఆ తర్వాత లడ్డూ విషయంలో చులకనగా మాట్లాడిన వారిపై మండిపడ్డారు. ప్రకాశ్ రాజ్, పొన్నవోలు సుధాకర్, కార్తీ చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ తప్పు పట్టారు.
కార్తీ నటించిన తాజాగా సత్యం సుందరం ఈ మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో.. యాంకర్ కార్తీతో మాట్లాడుతూ.. లడ్డు కావాలా నాయాన.. అని ప్రశ్నిస్తుంది. దీనికి ఆయన.. లడ్డూ టాపిక్ వద్దని.. ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్ అని నవ్వుతూ వెటకారంగా మాట్లాడారు. లడ్డూ గురించి హీరో కార్తీ సెటైర్లు వేశారు. దీంతో ఇది కాస్త వివాదస్పదంగా మారింది. దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తూ.. కార్తీ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు.
తిరుమల లడ్డుపై ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అనడం.. సరికాదన్నారు. కార్తీ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. మరోసారి కార్తీ అలా అనొద్దంటూ కూడా సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఒక నటుడిగా కార్తీ అంటే నాకు గౌరవముందని, కానీ లడ్డూ విషయంలో చేసిన కామెంట్లు మాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. సినిమా రంగం వారు కూడా ఈ అంశంపై ఇష్టమున్నట్లు మాట్లాడవద్దని అన్నారు. మీకు దీని గురించి స్పందించాలని లేకుంటే .. సైలేంట్ గా ఉండాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో..సనాతన ధర్మం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే భరించే ప్రసక్తిలేదని పవన్ ఘాటుగానే స్పందించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు హీరో కార్తీ ట్విట్టర్ వేదికగా సారీ చెప్పారు.